వరంగల్ నగరంపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు : బోయినపల్లి వినోద్‌కుమార్
బోయినపల్లి వినోద్‌కుమార్ |

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ నగరంపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో 18 మందికి మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లితో కలిసి బీఫాంలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని డివిజన్లలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఉద్యమంలో చాలా మంది పని చేశారన్నారు. డీ లిమిటేషన్‌తో రిజర్వేషన్లు మారడంతో చాలా ఇబ్బందులెదురవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఇంకా జరగాల్సి ఉందని.. ఈ మేరకు ముందుకెళ్తున్నామన్నారు.
కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరిగిందని ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులు ఎంత? తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఎంత ఇస్తుందో చెబితే బాగుంటుందన్నారు. మనం చెల్లించిన మేరకు కేంద్రం మనకు చాలా ఇవ్వాల్సి ఉందన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై తమకు స్పష్టత ఉందన్నారు. వరంగల్‌కు రింగ్ రోడ్డు వచ్చిందని, మంచినీటి పథకాలు, డ్రైనేజీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ముంబై తర్వాత పుణెలా.. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందనుందన్నారు. ఇప్పటికే ఐటీ టవర్క్ వచ్చాయని, ఇంకా చాలా వస్తున్నాయని చెప్పారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణలో పట్టణీకరణ గొప్పగా జరుగుతోందన్నారు. ఇందులో కొన్నింటిని ప్రధాన నగరాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ రామన్న!
భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
మే 4 వరకు కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం : అమెరికా
13 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా.. ఎక్కడంటే?
ఈ నెల 24 నుంచి ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు
కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 2వేల మరణాలు.. 2.95లక్షల కేసులు
ఈ నెల 30 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
మహారాష్ట్రలో నేడు లాక్డౌన్ ప్రకటించనున్న సీఎం ?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

