భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి

- ముఖ్యమత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు
- ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. అందువల్ల భద్రాద్రి ఆలయంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా వీక్షించాలని ప్రజలకు సూచించారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని అన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని శ్రీసీతారాములను సీఎం ప్రార్థించారు.
రాముడి ఆశీర్వాదంతో కరోనాను జయిద్దాం: గవర్నర్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడి ఆశీర్వాదంతో కొవిడ్-19పై విజయవంతంగా పోరాడి, ప్రజలు దాన్నుంచి బయటపడాలని ఆమె ఆకాంక్షించారు. మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bhadradri
- KCR
- online
- Sriramanavami
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

