తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు
తెలంగాణ |

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.
రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 కేసులు వచ్చాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్ అర్బన్ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కి చేరగా.. ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
తెలంగాణ రామన్న!
భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ఆన్లైన్లో వీక్షించండి
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ
మే 4 వరకు కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం : అమెరికా
13 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా.. ఎక్కడంటే?
ఈ నెల 24 నుంచి ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

