రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ

- మంగళవారం రాత్రి నుంచే అమల్లోకి నిషేధాజ్ఞలు
- మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు
కనిపిస్తేనే కాటేసేలా తయారైందీ.. కరోనా. పెద్దోడా, చిన్నోడా, ఉన్నోడా, లేనోడా అన్న తేడా లేకుండా అందర్నీ కరిచేస్తున్నది. గత ఏడాది పలకరించి పోయా.. ఈసారి ఇంట్లోనే తిష్ట వేస్తానంటూ ప్రజల గుండెల్లో బుగులు రేపుతున్నది. ఒకరి నుంచి ఒకరిద్దరికి కాదు.. ఒకేసారి పదిమందిని పట్టి పీడిస్తున్నది.
గతం కంటే మరింత క్రూరత్వంతో దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్న వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ‘రాత్రి కర్ఫ్యూ’ను ప్రయోగించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, ప్రజలు ఇల్లు దాటి బయటికి రావొద్దని ఆదేశించింది. రాత్రి 8 గంటల్లోపే అన్ని వ్యాపారసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు, రెస్టారెంట్లు మూసేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మే 1 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు కఠినంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఆంక్షలు విధించుకోవాలని కేంద్రహోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట జనసంచారాన్ని నిలువరించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో అధికారులు కర్ఫ్యూ విధించారు. సోమవారం రాత్రి నుంచే కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోనున్నారు. మినహాయింపు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఇచ్చే ఎమర్జెన్సీ డ్యూటీ గుర్తింపుకార్డు ఉండాలి. అన్ని ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే వైద్యసిబ్బంది, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, దవాఖాన సర్వీస్ ప్రొవైడర్లు గుర్తింపుకార్డు తప్పనిసరి ఉపయోగించాలి.
వీటికి మినహాయింపు..
- దవాఖానలు
- డయాగ్నస్టిక్ సెంటర్లు
- ల్యాబ్‌లు, ఫార్మసీలు
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
- టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసెస్, ఐటీ, ఐటీ అనుబంధ సేవలు
- ఈ-కామర్స్ ద్వారా అన్ని వస్తువుల పంపణీ
- పెట్రోల్ పంపులు, ఎల్పీ, సీఎన్జీ, పెట్రోలియం, గ్యాస్ ఔట్లెట్లు
- విద్యుత్తు ఉత్పత్తి- సరఫరా-పంపిణీ
- నీటిసరఫరా-పారిశుద్ధ్యం
- కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు
- ప్రైవేటు భద్రత సేవలు
- నిరంతర ప్రక్రియకు అవసరమయ్యే సేవలు, ఉత్పత్తి యూనిట్లు
- వైద్యసేవలు పొందే గర్భిణులు, రోగులు
ఇతర కీలకాంశాలు:
- విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి ఇండ్లకు వెళ్లే వ్యక్తుల వద్ద ప్రయాణం చేసిన టికెట్ తప్పనిసరిగా ఉండాలి.
- అంతర్రాష్ట్ర వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. వాటికి ప్రత్యేకపాస్లు అవసరం లేదు.
- కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినవారి రవాణా కోసం నిర్ణీత సమయంలో పనిచేసేందుకు ఆటోలు, టాక్సీలతో సహా ప్రజారవాణా సేవలకు అనుమతి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Curfew
- Night Curfew
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

