Nominations | రాయపోల్, నవంబర్ 27 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఏర్పాటు చేసిన నాలుగు క్లస్టర్లలో 13 మంది సర్పంచ్ అభ్యర్థులు, 11 మంది వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో జెమ్లానాయక్ తెలిపారు. రాయపోల్ క్లస్టర్లో ముగ్గురు సర్పంచ్, ఒకరు వార్డు సభ్యుడు, అనాజీపూర్ క్లస్టర్లో ఐదుగురు సర్పంచ్, ఒకరు వార్డు సభ్యుడు, రామారం క్లస్టర్లో ఒక సర్పంచ్, ఒక వార్డు సభ్యుడు, వడ్డేపల్లి క్లస్టర్లో నలుగురు సర్పంచ్ అభ్యర్థులు, ఎనిమిది మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు.
మంతూరు సర్పంచ్ పదవికి పాల రామాగౌడ్ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కాగా సర్పంచుల నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఆయా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతామని ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు హామీ ఇస్తున్నారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో యువత పోటీ చేయడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపిస్తున్నారు. మండలంలో మొత్తం 19 గ్రామపంచాయతీలు ఉండగా.. 166 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?