లక్నో: ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని స్మశానానికి తీసుకువచ్చారు. చితి పేర్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. అయితే వారు తీసుకువచ్చిన మృతదేహం అసహజంగా ఉండటంతో అక్కడున్న వారు అనుమానించారు. కప్పిన దుస్తులు తొలగించగా ప్లాస్టిక్ బొమ్మ కనిపించింది. ఇది చూసి వారు షాకయ్యారు. (Plastic Dummy On Funeral Pyre) ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం గర్ ముక్తేశ్వర్లోని బ్రిజ్ఘాట్లో నాటకీయ సంఘటన జరిగింది. ఇద్దరు యువకులు దహన సంస్కారాల కోసం ఒక మృతదేహాన్ని కారులో తీసుకువచ్చారు. కర్రలతో చితి పేర్చారు. దానిపై మృతదేహం ఉంచి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.
కాగా, స్మశానవాటికలోని వ్యక్తి చితిపై ఉన్న మృతదేహంపై అనుమానించాడు. చాలా తేలికగా, అసహజంగా ఉండటాన్ని గమనించాడు. దీంతో దానిపై కప్పిన దుస్తులను స్థానికులు తొలగించారు. అయితే మృతదేహానికి బదులు ప్లాస్టిక్ బొమ్మ ఉండటం చూసి వారు షాక్ అయ్యారు.
మరోవైపు మరో వ్యక్తి అంత్యక్రియల కోసం వచ్చిన గ్రామస్తులు ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇన్సురెన్స్ కోసం లేదా జీవించి ఉన్న వ్యక్తి చనిపోయినట్లుగా తప్పుడు ఆధారాల కోసం లేదా ఏదైనా నేరపూరిత కుట్ర కోసం ఆ వ్యక్తులు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే చితిపై ప్లాస్టిక్ బొమ్మ ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हापुड़ : हापुड़ से चौंकाने वाली खबर आई सामने
शव की जगह पुतला लेकर पहुंचा परिवार
ब्रजघाट में अंतिम संस्कार करने पहुँचा परिवार
दिल्ली से अंतिम संस्कार करने आया था परिवार
पुलिस ने दो लोगों को हिरासत में लिया, जांच जारी —
गढ़ कोतवाली ब्रजघाट मामला
#DummyCorpseScam… pic.twitter.com/T1pgholdYE— India News UP/UK (@IndiaNewsUP_UK) November 27, 2025
Also Read:
IMEI Tampering Unit Busted | అక్రమ మొబైల్ ఫోన్స్ తయారీ.. ఐఎంఈఐ ట్యాంపరింగ్ యూనిట్ గుట్టురట్టు
Girl Pushed Into Prostitution By Mother | బాలికను వ్యభిచారంలోకి నెట్టిన.. తల్లి, పొరుగు వ్యక్తి
Watch: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకంటే?