జైపూర్: ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. (Farmer Plants Rs 500 Notes) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డియోరియా జతన్ గ్రామానికి చెందిన మల్లారం బవారీ రైతు. తన పొలంలో పత్తి పండించడానికి బ్యాంకు నుంచి లక్ష రుణం తీసుకున్నాడు. పంటకు బీమా కూడా చేయించాడు.
కాగా, అధిక వర్షాల వల్ల రైతు మల్లారం పొలం నీటిలో మునిగిపోయింది. దీంతో పత్తి పంట మొత్తం నాశనమైంది. కేవలం రూ.4,000 విలువైన పత్తి మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో పంట నష్ట పరిహారం కోసం బీమా కంపెనీకి ఫిర్యాదు చేశాడు.
మరోవైపు తన ఫిర్యాదుకు ఎవరూ స్పందించలేదని, ఏ అధికారి కూడా తన పొలాన్ని సందర్శించలేదని రైతు మల్లారం ఆరోపించాడు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపాడు. తన పొలంలో రూ. 500 కరెన్సీ నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఇప్పుడైనా అధికారులు స్పందించి బీమా చేసిన పంటకు నష్టపరిహారం చెల్లిస్తారేమోనని ఆ రైతు ఆశగా ఎదురు చూస్తున్నాడు.
किसान ने उगाए 500- 500 के नोट
नागौर के देवरिया जाटान गांव में किसान मल्ला राम बावरी ने फसल खराब होने और बीमा क्लेम न मिलने से नाराज़ होकर अपने खेत में 500-500 रुपये के नोट बो दिए. इस अनोखे विरोध का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है#Rajasthan pic.twitter.com/TW3zAkDi1b
— NDTV Rajasthan (@NDTV_Rajasthan) November 27, 2025
Also Read:
Girl Pushed Into Prostitution By Mother | బాలికను వ్యభిచారంలోకి నెట్టిన.. తల్లి, పొరుగు వ్యక్తి
IMEI Tampering Unit Busted | అక్రమ మొబైల్ ఫోన్స్ తయారీ.. ఐఎంఈఐ ట్యాంపరింగ్ యూనిట్ గుట్టురట్టు
Sengottaiyan Joins TVK | విజయ్ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్