బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్ల వల్ల ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కాలు, చేయి విరుగడంతో ఆసుపత్రి పాలయ్యాడు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న అతడు ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దయచేసి రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. (Man Hospitalised Due to Bengaluru roads) బెంగళూరులోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోడ్డు ప్రమాదాల వల్ల పలువురు గాయపడగా కొందరు మరణించారు.
కాగా, తాజా బైక్‌పై వెళ్తున్న సౌరభ్ పాండే, బెంగళూరులోని అధ్వాన్న రోడ్డు వల్ల ప్రమాదానికి గురయ్యాడు. అతడి కాలు, చేయి విరుగడంతో ఆసుపత్రిలో చేరాడు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న సౌరభ్ వీడియోలో మాట్లాడాడు. ‘బెంగళూరులోని ఏ రోడ్డు అయినా గుంతలతో నిండి ఉన్నది. ప్రమాదంలో నా కాలు, చేయి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. నా దయనీయ పరిస్థితిని మీరు చూడండి. దయచేసి నగర రోడ్ల గురించి ఏదైనా చేయండి. ఇప్పటికే సమయం మించిపోయింది’ అని అందులో వాపోయాడు.
మరోవైపు సౌరభ్ పాండే స్నేహితురాలు ఖ్యాతి శ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. తన ఫ్రెండ్ ప్రమాదానికి బెంగళూరు రోడ్లు కారణమని ఆరోపించింది. చికిత్సకు రూ.6 లక్షలు ఖర్చయినట్లు తెలిపింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించింది. అయితే అతడు ఆరు నెలల పాటు కదలలేని పరిస్థితిలో ఉన్నట్లు వాపోయింది.
కాగా, తన స్నేహితుడు సౌరభ్ పాండే పరిస్థితికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించింది. గుర్తులు లేని స్పీడ్ బ్రేకర్లు, రోడ్డుపై గుంతలు, రోడ్డు భద్రతకు జవాబుదారీతనం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క స్పీడ్ బ్రేకర్‌ను రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు తన ఫ్రెండ్ చికిత్సకు అయిన ఖర్చు కంటే తక్కువేనని వాపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా బెంగళూరు రోడ్ల దుస్థితిపై మండిపడ్డారు.
Also Read:
Sengottaiyan Joins TVK | విజయ్ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్
Child On Car Roof | బైక్‌ను ఢీకొట్టిన కారు.. దాని టాప్‌పై పడిన బాలుడు, అలాగే నడిపిన డ్రైవర్
Watch: ఆక్రమణల డ్రైవ్‌లో మెట్లు కూల్చివేత.. బ్యాంకు కస్టమర్లు ఎలా చేరుకున్నారంటే?