భువనేశ్వర్: ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మొదటి అంతస్తులో ఉన్నది. ఆక్రమణల డ్రైవ్‌లో భాగంగా అధికారులు మెట్లను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు నిచ్చెన ద్వారా పైకి చేరుకున్నారు. (SBI Stairs Disappear) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చరంప మార్కెట్ నుంచి భద్రక్ రైల్వే స్టేషన్ వరకు ఉన్న ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
కాగా, కొందరు స్పందించకపోవడంతో నవంబర్ 20, 21న ఆక్రమణల తొలగింపు డ్రైవ్ చేపట్టారు. ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ ఉన్న బిల్డింగ్ మెట్లతో సహా పలు షాపులు, ఇళ్లు వద్ద ఆక్రమిత స్థలంలోని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.
మరోవైపు మెట్లు కూల్చివేయడంతో బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌కు చేరుకునేందుకు ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాక్టర్ ట్రాలీపై ఏర్పాటు చేసిన నిచ్చెన ద్వారా కొందరు పైకి ఎక్కారు. పైన ఉన్న సెక్యూరిటీ గార్డు, సిబ్బంది వారికి సహకరించారు.
చివరకు ఆ బిల్డింగ్ యజమాని బుధవారం స్టీల్ మెట్లను ఏర్పాటు చేశాడు. దీంతో ఆ బ్యాంకు కార్యాలయంలోకి సాధారణ ప్రవేశాన్ని పునరుద్ధరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.
#Bhadrak Customers Climb Ladder to Reach SBI Branch After Staircase Demolition in #Odisha
(Video courtesy : X) pic.twitter.com/LJCu8TLgBg— Deccan Chronicle (@DeccanChronicle) November 25, 2025
Also Read:
Child On Car Roof | బైక్‌ను ఢీకొట్టిన కారు.. దాని టాప్‌పై పడిన బాలుడు, అలాగే నడిపిన డ్రైవర్
Karnataka Seer Acquitted | బాలికలపై లైంగిక దాడి కేసులో.. కర్ణాటక మఠాధిపతి నిర్దోషి
VIT University | యూనివర్సిటీలో కామెర్లు వ్యాప్తి.. విద్యార్థుల ఆందోళన, వాహనాలకు నిప్పు
Watch: విరిగిన బాస్కెట్ బాల్ పోల్.. జాతీయ స్థాయి క్రీడాకారుడు మృతి