భోపాల్: యూనివర్సిటీలో కామెర్లు వ్యాపించాయి. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీటి కారణంగా క్యాంపస్‌లోని విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. (VIT University) మధ్యప్రదేశ్ సెహోర్‌లోని వీఐటీ యూనివర్శిటీలో ఈ సంఘటన జరిగింది. నాణ్యత లేని ఆహారం, కలుషిత నీరు కారణంగా క్యాంపస్‌లో కామెర్లు వ్యాపించినట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యం పాలైన కొందరు మరణించినట్లు ఆరోపించారు. యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని మండిపడ్డారు.
కాగా, మంగళవారం రాత్రి వేళ వీఐటీ యూనివర్శిటీకి చెందిన సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. క్యాంపస్‌లో కామెర్ల వ్యాప్తిపై యాజమాన్యం స్పందించడం లేదని ఆగ్రహించారు. భద్రతా సిబ్బంది తమను కొట్టినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రాంగణంలోని పలు విభాగాలను ధ్వంసం చేశారు. బస్సులు, కార్లను తగులబెట్టారు. అంబులెన్స్‌ను ధ్వంసం చేశారు.
మరోవైపు యూనివర్సిటీలో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. క్యాంపస్‌లో కలుషిత ఆహారం, నీరు కారణంగా కామెర్ల వ్యాప్తి, విద్యార్థులపై గార్డుల దాడి, విధ్వంసం వంటి సంఘటనలపై పోలీసులు, జిల్లా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే విద్యార్థులు ఎవరూ కూడా అనారోగ్యంతో మరణించలేదని రిజిస్ట్రార్ తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. యూనివర్సిటీలో ఉద్రిక్తతల నేపథ్యంలో నవంబర్ 30 వరకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు తమ ఊర్లకు బయలుదేరారు.
Vellore Institute of Technology (VIT bhopal) में रात्रि को 2 बजे
हजारों छात्र सड़कों पर है सरकार तुरंत संज्ञान.. vit को बंद करें हजारों लोगों को एडमिशन दे दिए व्यवस्था पानी के पीने तक कि नहीं #VITBhopal— rora chats~ (@rora_chats) November 26, 2025
Also Read:
Watch: విరిగిన బాస్కెట్ బాల్ పోల్.. జాతీయ స్థాయి క్రీడాకారుడు మృతి
Watch: అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?