YS Sharmila | మహిళలను నగ్నంగా ఊరేగిస్తే చోద్యం చూసిన చరిత్ర బీజేపీది.. షర్మిల ఫైర్
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ పేరుకే ఉన్నాయని.. వికసిత్ భారత్ వట్టిమాటేనని అన్నారు.
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ పేరుకే ఉన్నాయని.. వికసిత్ భారత్ వట్టిమాటేనని అన్నారు.
మహిళలను నగ్నంగా ఊరేగిస్తే చోద్యం చూసిన చరిత్ర బీజేపీది అని షర్మిల మండిపడ్డారు. మహిళలంటే కేంద్రానికి ఓటేసే యంత్రాలతో సమానమని వ్యాఖ్యానించారు ఆకర్షక పథకాలతో మభ్య పెట్టి మోసం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాటి అని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో మూడు హామీలు మహిళలకు ఇచ్చి నయవంచన చేశారని మండిపడ్డారు.
మహాశక్తి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తామని చెప్పి.. రాష్ట్రంలో 1.80 లక్షల మంది మహిళలను మోసం చేశారని చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది తల్లులకు టోకరా పెట్టారని అన్నారు. ఇంటికి మూడు సిలిండర్లని చెప్పి ఒక్కటే ఇచ్చారని.. ఇవాళ గ్యాస్ ధరలు మళ్లీ పెంచి వంటింటిపై భారం మోపారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంటగ్యాస్ ధరలు పెరిగితే ఆ భారమంతా ప్రభుత్వమే మోసేదని గుర్తుచేశారు.
3 నుంచి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలని హామీ ఇచ్చి 1.18 లక్షల మంది డ్వాక్రా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. అంగన్ వాడీలకు, ఆశా వర్కర్లకు హామీలిచ్చి అర్ధరాత్రి అరెస్టులు చేయించి దారుణంగా అవమానించారని అన్నారు. రెండేళ్ల పాలనలో కుటుంబాలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి మహిళలను ఉద్ధరించడానికి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.
దేశంలో మహిళలకు భద్రత లేదు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ ? మోడీ గారి @narendramodi నారీ చట్టాలన్నీ పేరుకే. వికసిత భారత్ వట్టిమాటే. మహిళలను నగ్నంగా ఊరేగిస్తే చోద్యం చూసిన చరిత్ర బీజేపీది. మహిళలంటే కేంద్రానికి ఓటేసే యంత్రాలతో సమానం. ఆకర్షక… pic.twitter.com/jDdUTiNjYO
— YS Sharmila (@realyssharmila) March 8, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

