T20 World Cup Final : క్రికెట్ అభిమానులను ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. అహ్మదాబాద్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్(India), న్యూజిలాండ్(Newzealand) తాడోపేడో తేల్చుకోనున్నాయి. టీమిండియా వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. తొలిసారి విజేతగా అవతరించాలని కివీస్ ఆరాటపడుతోంది. సూపర్ 8, సెమీఫైనల్లో సంచలన ఆటతో ఫైనల్ ఫైట్‌కు కాచుకున్న ఇరుజట్లలో ట్రోఫీని ముద్దాడేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ బిగ్ మ్యాచ్‌ను కళ్లారా చూసేందుకు మాజీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ అహ్మదాబాద్ చేరుకున్నారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా రెండోసారి కప్‌ను ఒడిసిపట్టడం చేడాలని దిగ్గజ ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా సైతం అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగింది. అక్కడి నుంచి తను నేరుగా నరేంద్ర మోడీ స్టేడియం చేరుకోనుంది.
#WATCH | Ahmedabad, Gujarat: Former Indian cricketers Sunil Gavaskar and Irfan Pathan arrived in Ahmedabad ahead of the ICC Men’s T20 World Cup 2026 final match between India and New Zealand tomorrow, March 8, 2026. pic.twitter.com/bbrS4Xw1Nr
— ANI (@ANI) March 7, 2026
#WATCH | Gujarat | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni arrives at Ahmedabad
ICC Men’s T20 World Cup 2026 final between India and New Zealand, to be played today at the Narendra Modi Stadium. pic.twitter.com/r7Cm9ognwj
— ANI (@ANI) March 8, 2026
లండన్‌ను తన రెండో ఇల్లుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ సైతం.. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించే అవకాశముంది. ఐసీసీ ఛైర్మన్ జై షా, టీ20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫైనల్ పోరులో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. రికార్డుల పరంగా ఐసీసీ ఫైనల్స్‌లో భారత్‌పై 2-1తో న్యూజిలాండ్‌దే పైచేయి. అయితే.. సన్నాహక సిరీస్‌లో కివీస్‌లో 4-1తో చిత్తు చేసిన సూర్యకుమార్ యాదవ్ సేన మరే జట్టుకు సాధ్యంకాని విధంగా వరుసగా రెండో కప్‌ను.. మొత్తంగా మూడో ట్రోఫీని కొల్లగొట్టాలని పట్టుదలతో ఉంది.
Ahmedabad, Gujarat: Indian actress Preity Zinta arrived at airport in Ahmedabad to watch the ICC Men’s T20 World Cup 2026 final between India and New Zealand pic.twitter.com/H73mN9Ahkk
— IANS (@ians_india) March 8, 2026