Meerut ‘Blue Drum’ Murder | బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టిన ముస్కాన్.. డీఎన్ఏ టెస్ట్‌కు అత్తింటి కుటుంబం డిమాండ్
Meerut 'Blue Drum' Murder | సంచలనం రేపిన ‘బ్లూ డ్రమ్’ హత్య కేసు నిందితురాలు ఇటీవల ఆడ పిల్లకు జన్మనిచ్చింది. జైలులో ఉన్న ఆమె తన బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టింది. ప్రియుడు ద్వారా ఆ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు అత్తింటి వారు అనుమానిస్తున్నారు. డీఎన్ఏ టెస్ట్‌కు డిమాండ్ చేస్తున్నారు.
లక్నో: సంచలనం రేపిన ‘బ్లూ డ్రమ్’ హత్య కేసు నిందితురాలు ఇటీవల ఆడ పిల్లకు జన్మనిచ్చింది. జైలులో ఉన్న ఆమె తన బిడ్డకు ‘రాధ’ అని పేరు పెట్టింది. ప్రియుడు ద్వారా ఆ బిడ్డకు ఆమె జన్మనిచ్చినట్లు అత్తింటి వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ టెస్ట్‌కు డిమాండ్ చేస్తున్నారు. (Meerut ‘Blue Drum’ Murder) ఈ ఏడాది మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి నీలిరంగు డ్రమ్‌లో కుక్కారు. దానిని సిమెంట్‌తో నింపారు.
కాగా, భర్త హత్య తర్వాత సిమ్లా వెళ్లిన ఈ జంట అక్కడ ఎంజాయ్ చేశారు. మార్చి 17న మీరట్‌కు తిరిగి వచ్చారు. మృతదేహం ఉన్న బ్లూ డ్రమ్ పడేసేందుకు ప్రయత్నించగా భర్త సౌరభ్ హత్య విషయం బయటపడింది. దీంతో ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి వారిద్దరూ జైలులో ఉన్నారు.
మరోవైపు ఏప్రిల్‌లో జైలులోని ఖైదీలకు నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షల్లో ముస్కాన్ గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. తాజాగా నెలలు నిండటంతో సోమవారం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నవంబర్ 24న భద్రత మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆడ పిల్లకు ముస్కాన్ జన్మనిచ్చినట్లు గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ షాగున్ తెలిపారు. తన బిడ్డకు ‘రాధ’ అని ఆమె పేరు పెట్టినట్లు చెప్పారు. మగ పిల్లవాడు పుడితే ‘కృష్ణ’ అని పేరు పెడతానని ముస్కాన్ చెప్పిందన్నారు. బుధవారం బిడ్డతో పాటు ఆమెను జైలుకు పంపుతామని వెల్లడించారు.
కాగా, ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్‌కు జైలులోని మహిళా బ్యారక్‌లో ప్రత్యేక వసతులు కల్పిస్తామని జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. నవజాత శిశువుకు అవసరమైన దుస్తులు, పోషకాహారం, వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. ఆ బిడ్డకు ఆరేళ్లు వచ్చే వరకు తల్లితో పాటు జైలులో ఉండవచ్చని అన్నారు.
మరోవైపు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ముస్తాన్, యాదృచికంగా సౌరభ్ పుట్టిన రోజైన నవంబర్ 24న ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అయితే ప్రియుడు సాహిల్ ద్వారా ఆమె గర్భం దాల్చినట్లు అత్తింటి వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టిన ఆడ పిల్లతో పాటు తొలి సంతానమైన కుమార్తెకు కూడా డీఎన్ఏ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. దీని కోసం తాము కోర్టును ఆశయిస్తామని సౌరభ్ తల్లి, సోదరుడు మీడియాతో అన్నారు.
Also Read:
Meerut Blue Drum Case | బిడ్డకు జన్మనిచ్చిన.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ముస్కాన్
Watch: అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

