పంటలను కాపాడ్తరా..పరిహారమిస్తరా?
సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల ఉసురు తాకుతది.. వారిని నిలువునా ముంచుతుండ్రు.. సాగునీరు అందక చేతికొచ్చే పంటలు మట్టి పాలవుతున్నయి.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా’.
- సీఎంకు రైతుల ఉసురు తాకుతది
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
- ధర్మాపురం రెవెన్యూ తండాల్లో ఎండిన పంటల పరిశీలన
దేవరుప్పుల, మార్చి 9 : ‘సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల ఉసురు తాకుతది.. వారిని నిలువునా ముంచుతుండ్రు.. సాగునీరు అందక చేతికొచ్చే పంటలు మట్టి పాలవుతున్నయి.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా’.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని మాల్యాతండా, లకావత్ తండా, దుబ్బతండాల్లో సాగునీరు అందక ఎండుతున్న వరి, మక్క పంటలను ఆయన పరిశీలించారు. చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నాయని గిరిజన రైతులు ఎర్రబెల్లి ముందు కన్నీరు పెట్టగా ఆయన చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లుండీ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఉత్తమన్నా.. రైతులను కాపాడండి..
ఉత్తమన్నా.. సాగునీరు వదిలి యాసంగి పంటలను కాపాడాలని మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫోన్లో వేడుకున్నారు. ఎస్సారెస్పీ నీరు వర్ధన్నపేట, రాయపర్తి మండలాలకు రావడంలేదని, దేవాదుల నీరు పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల కాలువల ద్వారా రాకపోవడంతో యాసంగి పంటలు ఎండుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

