ముంబై: ఒక బాలికను ఆమె తల్లి, పొరుగు వ్యక్తి కలిసి వ్యభిచారంలోకి నెట్టారు. ఆమె ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. భరించలేని ఆ బాలిక తన టీచర్‌కు ఈ విషయం చెప్పింది. దీంతో స్కూల్ అధికారుల సమాచారంతో పోలీసులు స్పందించారు. (Girl Pushed Into Prostitution By Mother) బాలిక తల్లి, పొరుగు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఘట్కోపర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తల్లి, పొరుగు వ్యక్తి కలిసి ఆమెను వ్యభిచార రొంపిలోకి దించారు. ఆ బాలికతో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.
కాగా, దీనిని భరించలేని ఆ బాలిక ఒకసారి ఇంటి నుంచి పారిపోయింది. స్నేహితురాలి వద్ద మూడు రోజులు ఉన్నది. తిరిగి ఇంటికి చేరుకున్న ఆ బాలికతో తల్లి, పొరుగు వ్యక్తి వ్యభిచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నేహితురాలితో కలిసి స్కూల్ టీచర్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకున్నది. షాక్ అయిన ఆ టీచర్ స్కూల్ అధికారులకు సమాచారం ఇచ్చింది.
మరోవైపు నవంబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ స్కూల్ టీచర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. బాధిత బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె తల్లి, పొరుగు వ్యక్తిపై పోక్సో చట్టం, అత్యాచారం, పిల్లలతో వ్యభిచారం చేయించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:
Sengottaiyan Joins TVK | విజయ్ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్
IMEI Tampering Unit Busted | అక్రమ మొబైల్ ఫోన్స్ తయారీ.. ఐఎంఈఐ ట్యాంపరింగ్ యూనిట్ గుట్టురట్టు