న్యూఢిల్లీ: అక్రమంగా మొబైల్ ఫోన్లు తయారు చేయడంతోపాటు ఐఎంఈఐ ట్యాంపరింగ్ చేస్తున్న కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ కార్యాలయంపై రైడ్ చేశారు. ఐఎంఈఐ ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ కలిగిన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ విడి భాగాలు, ముద్రించిన ఐఎంఈఐ లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. (IMEI Tampering Unit Busted) ఐదుగురిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కరోల్ బాగ్‌లోని బీదోన్పురా ప్రాంతంలో అనుమానాస్పద మొబైల్ ఫోన్స్ కార్యకలాపాల గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. అక్రమంగా మొబైల్ ఫోన్స్ తయారు చేయడంతోపాటు మొబైల్‌ను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక సీరియల్ నంబర్ ఐఎంఈఐ ట్యాంపరింగ్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలిసింది.
కాగా, నవంబర్ 20న బీదోన్పురాలోని కమర్షియల్ బిల్డింగ్ నాల్గవ అంతస్తులో ఉన్న ఆదిత్య ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై పోలీసులు రైడ్ చేశారు. ఐఎంఈఐ ట్యాంపరింగ్ సాఫ్ట్వేర్ కలిగిన 1,826 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ తయారీ విడి భాగాలు, ముద్రించిన ఐఎంఈఐ లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులైన అశోక్ కుమార్, రాంనారాయణ్, ధర్మేంద్ర కుమార్, దీపాంషు, దీపక్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఐఎంఈఐ ట్యాంపరింగ్ మొబైల్ ఫోన్స్‌ను కరోల్ బాగ్, గఫార్ మార్కెట్, ఢిల్లీ-ఎన్సీఆర్లోని ప్రసిద్ధ మొబైల్ ఫోన్ మార్కెట్లో పలు మార్గాల ద్వారా సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో చైనా విడి భాగాలు ఎక్కడ నుంచి, ఎవరి ద్వారా తెస్తున్నారు, ఐఎంఈఐ ట్యాంపరింగ్ మొబైల్ ఫోన్స్ ఎవరికి విక్రయించారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తద్వారా సైబర్ నేరాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
Also Read:
Sengottaiyan Joins TVK | విజయ్ పార్టీలో చేరిన.. అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్
Watch: ఆక్రమణల డ్రైవ్‌లో మెట్లు కూల్చివేత.. బ్యాంకు కస్టమర్లు ఎలా చేరుకున్నారంటే?