కారేపల్లి(ఖమ్మం), నవంబర్ 27 : ఎరీస్ ఆగ్రో లిమిటెడ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఖమ్మం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఖమ్మంలో గల అన్నంసేవ ఫౌండేషన్ వారి అనాథ ఆశ్రమంలో 192 మందికి పైగా అన్నదానం చేశారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాలో ఎరీస్ సంస్థ వారు రైతు సదస్సులను నిర్వహించి వాతావరణంలో మార్పుల వల్ల పంటలకు వచ్చే సమస్యలను, ఎరీస్ ఉత్పాదనల ప్రాముఖ్యతను వివరించారు. రైతు సదస్సులకు హాజరైన రైతులకు క్విజ్ నిర్వహించి విజేతలకు ఏరీస్ వారి పోషక ఉత్పత్తులు, శౌర్య బ్యాటరీ స్ప్రేయర్లు బహుమతులుగా అందజేశారు.
ప్రతినిధులు జయప్రదీప్, సుబ్రమణియన్, నల్లపనేని బాబురావు మాట్లాడుతూ.. ఏరీస్ రైతు సంక్షేమానికి, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త ఉత్పత్తులు, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా రైతులకు నాణ్యమైన దిగుబడి ఆర్థిక అభివృద్ధికి కృషి చేకూరుస్తున్నామన్నారు. రైతులు తమ మీద ఉంచిన నమ్మకానికి ఏరీస్ సిబ్బంది ఎప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.