BRS Party | జహీరాబాద్ , నవంబర్ 27 : మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు గురించి తప్పుడు కూతలు కూస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండి మోహన్ , బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి రాకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. సూర్యునిపై ఉమ్మేసి తమాషాలు చూసే కడియం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే చందంగా వ్యవహరిస్తూ నమ్మిన ప్రజలను, నమ్మిన బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారన్నారు. తన స్వంత కాంట్రాక్టుల కోసం , స్వంత స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కూతురిని పార్లమెంటు సభ్యురాలిగా చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి పార్టీపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.
కాసుల కక్కుర్తి కోసం విమర్శలు చేస్తే ఊరుకోం..
మాజీ మంత్రి డాక్టర్ రాజన్నకు కాదని బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టును నీకు ఇచ్చి గెలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన నీకు మా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. కేవలం నీ కూతురి రాజకీయ ప్రస్థానం, నీ స్వలాభం, కాసుల కక్కుర్తి కోసం బీఆర్ఎస్ పార్టీపై నీ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడే ముందు నీది నువ్వే ఆత్మ విమర్శ చేసుకోవాలని మా పార్టీ బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అదే విధంగా మూడు ముక్కలు చేయాలి అనే అనుకుంటే రానున్న రోజుల్లో మూడు పువ్వులు ఆరు కాయల్లా గా మా పార్టీ వికసిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. నువ్వు కాంగ్రెస్ బ్రోకర్‌గా మారి తొత్తుగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు నమ్మి పరిస్థితిలో లేరని అన్నారు.
కడియం మీలాగా పదవి కోసమో ధనం కోసమో మారే వ్యక్తి మా హరీషన్న, మా కేటీఆర్ అన్న కాదన్నారు. నీకు, నీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలతో మోసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మీకు ఓటుతో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
Removed flexi | ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు.. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
Harish Rao | కాళోజీ వర్సిటీలో అవినీతి బాగోతంపై గవర్నర్‌కు హరీశ్‌రావు లేఖ
Girl Pushed Into Prostitution By Mother | బాలికను వ్యభిచారంలోకి నెట్టిన.. తల్లి, పొరుగు వ్యక్తి