Removed flexi | మంథని రూరల్,నవంబర్27: మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్ని ప్రచురించిన వెంటనే అధికారులు స్పందించి అట్టి ఫ్లెక్సీలను తొలగించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించాల్సిన అధికారులు ఫ్లెక్సీ ల పై పడదాలను కప్పడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరదాలను కప్పడం ద్వారా గాలి విచినప్పుడు పర్దాలు లేచిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రోడ్డుపైన ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. ఫ్లెక్సీలను తొలగించే విధంగా పత్రికలో ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.