సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా..
కట్టంగూర్, మార్చి 08 : మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఉపాధి హామీ సిబ్బందిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. నేటి మహిళలకు ఎనలేని శక్తి ఉందని, తమ సామర్థ్యాలను వినియోగించుకుని ముందుకెళ్లాలన్నారు. గ్రామ స్థాయిలో ఆరోగ్యం, పోషణ, శిశు సంక్షేమం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగితేనే పిల్లలు సైతం స్ఫూర్తిని పొంది తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళ పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ముషం రాణి ఉమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

