బాగ్దాద్: అమెరికా విమానం గురువారం రాత్రి ఇరాక్‌లో కూలింది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ(US Military) కన్ఫర్మ్ చేసింది. మిలిటరీకి చెందిన కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానం కూలినట్లు అధికారులు ద్రువీకరించారు. ఈ ఘటనలో రెండు విమానాలు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. అయితే శత్రు దేశం కానీ, ఫ్రెండ్లీ ఫైరింగ్ కానీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ ఇరాక్‌లో ప్రస్తుతం రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే ఇదే ఘటనలో భాగస్వామ్యమైన మరో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు.
కేసీ-135 విమానం ఎందుకు కూలిందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇది కేవలం రీఫ్యుయలింగ్ విమానం మాత్రమే. అంటే ఇతర విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపుతుంది. అయితే బహుశా గగనతలంలోనే ఏదైనా ఢీకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు. రీఫ్యూయలింగ్ విమానాలు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సుదీర్ఘ దూరం ప్రయాణించే యుద్ధ విమానాలు, బాంబర్లకు రీఫ్యూయలింగ్ విమానాలు ఇంధనాన్ని అందజేస్తాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీ లాజెస్టికల్ ఆపరేషన్‌గా దీన్ని గుర్తించారు. ప్రస్తుత సమయంలో యుద్ధ విమానాలు అధిక సంఖ్యలో గాలిలో విహరిస్తున్నాయి. ఈ దశలో రీఫ్యూయలింగ్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఆ టెన్షన్లో అనుకోని ప్రమాదం ఏదైనా జరగడం వల్ల ఆ రీఫ్యూయలింగ్ విమానం కూలి ఉంటుందని భావిస్తున్నారు.
A U.S. Air Force KC-135 Stratotanker refuels a U.S. Navy F/A-18F Super Hornet over the middle east during Operation Epic Fury. pic.twitter.com/3z9UzXyLt9
— U.S. Central Command (@CENTCOM) March 12, 2026
రీఫ్యూయలింగ్ చేసే సమయంలో మరో విమానం ట్యాంక్ దగ్గరగా వెళ్లాల్సి వస్తుంది. ఇంధనం తీసుకునే విమానం.. రీఫ్యుయలింగ్ విమానం కిందకు వస్తుంది. ఆ తర్వాత లైట్లతో ట్యాంకర్‌ను ఆపరేట్ చేస్తారు. రెండు విమానాల మధ్య ప్లగింగ్ జరుగుతుంది. ఒకసారి కాంటాక్ట్ జరిగిన తర్వాత.. కొన్ని నిమిషాల పాటు ఫ్యూయల్ సరఫరా అవుతుంది. ఈ సమయంలో రెండు విమానాల మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. సాధారణంగా ఈ ఆపరేషన్స్‌ను రాత్రి పూట నిర్వహిస్తుంటారు. అయితే ఇంధన నింపే ప్రక్రియ చేపట్టే విమానాల పైలట్లకు చాలా నైపుణ్యం అవసరం ఉంటుంది. రీఫ్యుయలింగ్ జరుగుతున్న సమయంలో విమాన లైట్లను స్విచాఫ్ చేస్తారు. ఎందుకంటే శత్రు విమానాల దృష్టిలో పడవద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపడుతారు.
మిలిటరీకి చెందిన రీఫ్యుయలింగ్ విమానం కూలిన ఘటన ఇరాక్ గగనతలంలో చోటుచేసుకోవడం వల్ల ఈ ఘటన అంచనా వేయలేకపోతున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. కేసీ-135 విమానంలో సాధారణంగా ముగ్గురు పైలట్లు ఉంటారు. ఒక పైలట్, మరో కో-పైలట్, ఓ బూమ్ ఆపరేటర్ పనిచేస్తారు. అమెరికా వద్ద సుమారు 400 రీఫ్యుయలింగ్ ట్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది.
U.S. Central Command is aware of the loss of a U.S. KC-135 refueling aircraft. The incident occurred in friendly airspace during Operation Epic Fury, and rescue efforts are ongoing. Two aircraft were involved in the incident. One of the aircraft went down in western Iraq, and the…
— U.S. Central Command (@CENTCOM) March 12, 2026