హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మెట్పల్లిలో(Metpally) తాళాలు పగులగొట్టి ఓ ఆభరాణాల షాపులో(,jewelry shop) చోరీకి పాల్పడ్డారు. లాకర్ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. 30 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తాళాలు పగులగొట్టి ఉండటంతో గమనించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు గస్తీని పెంచి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Iran war | ఇరాన్ వార్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..! భారీ మూల్యం తప్పదని హెచ్చరిక