Karuppu | కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి కరుప్పు (Karuppu). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఊరమాస్ బీట్తో సాగుతున్న కరుప్పు ఫస్ట్ సింగిల్ God Mode నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ చిత్రాన్ని 2023 జనవరి 23న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా టాక్ ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తమిళ్ ఛానల్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసిందని ఇన్సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
మొత్తానికి ఇంకా విడుదల తేదీ ఫైనల్ కాకముందే పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం