Jeevan Reddy | పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారని తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ విషయం కూడా మీకు (మీడియా) తెలియకుండా జరుగదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పుడే, చైర్ పర్సన్ ప్రకటించబడ్డనాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.. ఏర్పడ్డది అని చెప్పాను. అంతే తప్ప ఇంతవరకు ఎలాంటి అడుగు వేయలేదు.. చూడాలి.. మా మిత్రులున్నారు.. మీరున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ ద్వారానే వెలువడుతదని చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్‌తో భవిష్యత్‌లో ఆయన పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు.. సందర్భం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటాను – మాజీ మంత్రి జీవన్ రెడ్డి https://t.co/3YiD08ePEz pic.twitter.com/KfBbqlcKDu
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026