Shivaji Raja | ఆ యాంకర్‌కి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. తీసుకెళ్లి ఏకంగా ఆయన భార్యకి ఇచ్చేసిందట..!
Shivaji Raja | సినిమాలు, సీరియల్స్, టీవీ షోల్లో ఎన్నో ఏళ్లుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సీనియర్ నటుడు శివాజీ రాజా రీసెంట్గా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో హీరో తండ్రి పాత్రతో ఆకట్టుకున్నారు.
Shivaji Raja | సినిమాలు, సీరియల్స్, టీవీ షోల్లో ఎన్నో ఏళ్లుగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సీనియర్ నటుడు శివాజీ రాజా రీసెంట్గా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో హీరో తండ్రి పాత్రతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సక్సెస్ మీట్లో ఆయన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు.ఈ చిత్రంలో శివాజీ రాజాతో పాటు నటీమణి, అప్పటి యాంకర్ అనిత చౌదరి భార్యాభర్తలుగా కనిపించారు. ఇద్దరూ గతంలో అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ శివాజీ రాజా సక్సెస్ మీట్లో ఒక సరదా సంఘటనను పంచుకున్నారు.
అనిత చాలా మంచి నటి. సెట్‌కి ఎప్పుడూ టైమ్‌కే వస్తుంది. మురారి సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఆమె ఖాళీగా కూర్చుంది. దాన్ని చూసిన దర్శకుడు కృష్ణవంశీ సరదాగా ‘ఖాళీగా కూర్చోకు… ఆమెకి తెలుగులో ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేయ్’ అని అన్నాడు. నేను కూడా సరే అని గోదావరి జిల్లా స్లాంగ్‌లో ఒక లవ్ లెటర్ రాశాను,” అని శివాజీ రాజా నవ్వుతూ చెప్పారు. అయితే ఆ లెటర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. ఆ లెటర్ తను ఒక్కతే చదువుతుందని అనుకున్నాను. కానీ అనిత యూనిట్ అంతా వినిపించింది. సరే అనుకున్నా… కొన్ని రోజుల తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండగా ఆ లెటర్‌ను మా మిసెస్‌కి చూపించింది. ఆ సందర్భం ఇప్పటికీ గుర్తు వస్తే నవ్వు వస్తుంది,” అని చెప్పుకొచ్చారు.
శివాజీ రాజా చెప్పిన ఈ సంఘటన సక్సెస్ మీట్ హాల్ని కాసేపు నవ్వులతో నింపింది. చిత్రబృందం పాల్గొన్న ఈ కార్యక్రమం సానుకూల వాతావరణంలో సాగింది. అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్, రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా, హీరో శ్రీవిష్ణుతో పాటు, దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

