Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం
Sampath Nandi | టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య మంగళవారం (నవంబర్ 25) రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Sampath Nandi | టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య మంగళవారం (నవంబర్ 25) రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలోని ఓదెల గ్రామం సంపత్ నంది స్వస్థలం. నంది కిష్టయ్య అక్కడే నివసిస్తూ, గ్రామంలో అందరితోనూ మమేకమై ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తొలి సినిమా ‘ఏమైంది ఈవేళ’. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం సంపత్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ చిత్రం సంపత్ నందిని పెద్ద దర్శకుల జాబితాలో నిలబెట్టింది. ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ ఈ చిత్రాలు రవితేజ, గోపీచంద్‌లు ప్రధాన పాత్రలలో రూపొందగా, ఈ సినిమాలు ఆయన స్టైలిష్ మేకింగ్‌కు నిదర్శనంగా నిలిచాయి.
నిర్మాతగా కూడా సంపత్ నంది విజయం సాధించారు. తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఓదెల 2’ (2024) చిత్రం 2024లో అద్భుత విజయం సాధించింది. కథ, నిర్మాణ విలువలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంపత్ నంది ప్రస్తుతం నటుడు శర్వానంద్ హీరోగా ‘భోగి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

