టేకులపల్లి, మార్చి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ శాఖకు పాల్వంచకు చెందిన నవ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను బుధవారం అందజేసింది. ఈ సందర్భంగా టేకులపల్లి తాసీల్దార్ ఎల్.వీరభద్రం, సర్పంచ్ బోడ బాలు నాయక్ హాజరై మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందించడం అభినందనీయమన్నారు. లైబ్రేరియన్ ఆర్.నాగన్న మాట్లాడుతూ..గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరత ఉన్న నేపథ్యంలో నవ లిమిటెడ్ యాజమాన్యాన్ని సంప్రదించామని తెలిపారు. వెంటనే స్పందించి పుస్తకాలను అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వసంత, డీజీఎం ఏ జీ శంకర్, సీఎస్ఆర్ మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రాజేశ్, సీఎస్ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.