Local Body Elections | మెదక్ రూరల్, నవంబర్ 27 : గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అధికారులకు సూచించారు. గురువారం హవేలీ ఘనపూర్ మండలంలో భారతి లక్పతి నాయక్, ఎన్నికల వ్యయ పరిశీలకులు బలరాం, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీసీఈఓ ఎల్లయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్ కలిసి నామినేషన్ల కు సంబంధించిన కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి భారతి లక్పతి నాయక్ మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధృవ పత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆమె సూచించారు. నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు.
వ్యయ పరిశీలకులు బలరాం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు వ్యయం వివరాలు సమర్పించని యెడల గెలుపు రద్దు అవుతుందనే విషయాన్ని కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలో పోటీ చేసే అభ్యర్థలకు వ్యయాలకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాత ఉండాలని ఆయన సూచించారు.
సర్పంచ్, వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు పెట్టాలనే విషయము అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నామినేషన్ల కేంద్రాల పరిశీలనలో తహసిల్దార్ సింధు రేణుక, ఎంపిడిఓ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?