Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు.
Arvind Kejriwal : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన తొలిసారి స్పందించారు. తాను స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేసేందుకు వచ్చానని అన్నారు.
ఇన్నాళ్లుగా తాము బీజేపీ గూండాగిరిని ఎదిరించి పోరాడామని, ఇక ముందు కూడా ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని కేజ్రీవాల్ చెప్పారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆప్ సీనియర్ నాయకులంతా ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. సీఎం అతిషి మాత్రం చావుతప్ప కన్ను లొట్టపోయినట్టు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ దాదాపుగా 47 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఖాతా తెరువలేదు. అయితే ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘం అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

