Arvind Kejriwal : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఘోర పరాభవం ఎదురైంది. అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మనీశ్ సిసోడియా (Manish Sisodia) సహా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ప్రతిపక్ష బీజేపీ దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన విధంగానే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో బీజేపీ విజయానికి సంబంధించిన అంశాలతోపాటు.. ‘ఢిల్లీలో బీజేపీ ఎప్పటికీ తమను ఓడించలేదు’ అన్న అర్వింద్ కేజ్రీవాల్ పాత వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2023లో ఢిల్లీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదని, మా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని, అది జరగాలంటే ప్రధాని మోదీ మళ్లీ పుట్టాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
‘ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయాలనేది బీజేపీ నేతల ఉద్దేశం. ఆప్ సర్కారును కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ద్వారా ఆప్‌ను ఓడించలేమని వారికి (బీజేపీ నేతలకు) తెలుసు. నరేంద్రమోదీకి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మోదీజీ మీరు జీవితంలో ఎప్పటికీ ఢిల్లీలో ఆప్‌ను ఓడించలేరు. మమ్ములను ఢిల్లీలో ఓడించాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’ అని ఆ పాత వీడియోలో కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దాదాపుగా కైవసం చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు కేజ్రీవాల్ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బీజేపీ ఢిల్లీలో తమను ఎప్పటికీ ఓడించలేదన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను కింది వీడియోలో మీరు కూడా వినవచ్చు..
Modi ji: Haan to kya bola tha.. 😂 pic.twitter.com/82oRBWeXxX
— maithun (@Being_Humor) February 8, 2025
#WATCH | Delhi CM and AAP Convener Arvind Kejriwal says, ” Since AAP is growing fast, so it is natural that big conspiracies are being made against AAP. BJP and PM Modi released that they can’t win against AAP in Delhi…so they made a conspiracy ‘ Liquor policy scam’. Actual… pic.twitter.com/WnIiwfBB4s
— ANI (@ANI) November 17, 2023
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్