ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ౯Ichoda mandal ) గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై తిరుపతి (SI Tirupati) తెలిపిన వివరాల ప్రకారం, ఎంహెచ్ చంద్రపూరు గ్రామానికి చెందిన గైక్వాడ్ అంకుస్, భార్య జ్యోతితో జున్నితో కాలిసి రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.