Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ (BJP) అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ అత్యధికంగా 45 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూ ఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. ఒకానొక సమయంలో లీడ్‌లోకి వచ్చిన కేజ్రీ ఆ తర్వాత కొద్దిసేపటికే వెనుకపడిపోయారు. కేజ్రీపై బీజేపీ అభ్యర్థ పర్వేశ్ సాహిస్ సింగ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కేజ్రీపై పర్వేశ్ 1,170 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆమె ఒక్కసారి కూడా లీడ్‌లోకి రాలేదు. ఇక్కడ ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక షాకూర్‌బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ఏకంగా 15 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. జంగ్పూరాలో మనీశ్ సిసోడియా 2,438 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Also Read..
BJP | ఢిల్లీ ఫలితాల్లో ఆప్‌కు షాక్.. 45 స్థానాల్లో దూసుకెళ్తున్న బీజేపీ
KTR | రాహుల్ గాంధీకి అభినందనలు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్
Congress | కాంగ్రెస్ కథ కంచికే.. ఢిల్లీలో ఖాతా తెరవని హస్తం పార్టీ