BJP | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్త బీజేపీ (BJP) అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ అత్యధికంగా 45 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. తొలుత ఒక్క స్థానంలో లీడింగ్‌లోకి వచ్చిన హస్తం పార్టీ.. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఓ ఒక్కచోటా ప్రభావం చూపలేకపోతోంది.
ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఫలించాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, యమునా వివాదం, ఢిల్లీ పొల్యూషన్ వంటి అంశాలు బీజేపీకి కలిసొచ్చాయనే చెప్పాలి. ఫలితంగా కమలం పార్టీ ఢిల్లీలో అధికారం దిశగా ముందుకెళ్తోంది. ఇక ఈ ఫలితాల్లో కేజ్రీవాల్ మొదలుకొని సీఎం అతిశీ, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్, అవధ్ ఓజా, సౌరభ్ భరద్వాజ్ సహా ఆప్ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. ఫలితాల సరళిని చూస్తే బీజేపీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Also Read..
KTR | రాహుల్ గాంధీకి అభినందనలు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్
Congress | కాంగ్రెస్ కథ కంచికే.. ఢిల్లీలో ఖాతా తెరవని హస్తం పార్టీ
Saurabh Bharadwaj | ఆప్‌ను కూలదోసేందుకు అన్ని అధికారాలూ ప్రయోగించారు.. బీజేపీపై ఢిల్లీ మంత్రి ఫైర్