KTR | రాహుల్ గాంధీకి అభినందనలు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్
KTR | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీనే గెలిపించిందని వ్యాఖ్యానించారు.
KTR | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 41 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీనే గెలిపించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి అభినందనలు తెలిపారు. ‘బాగా పనిచేశారు. మళ్లీ బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025
Also Read..
Congress | కాంగ్రెస్ కథ కంచికే.. ఢిల్లీలో ఖాతా తెరవని హస్తం పార్టీ
Saurabh Bharadwaj | ఆప్ను కూలదోసేందుకు అన్ని అధికారాలూ ప్రయోగించారు.. బీజేపీపై ఢిల్లీ మంత్రి ఫైర్
Megastar Chiranjeevi | ప్రధాని మోదీకి చిరంజీవి థాంక్స్.. ఎందుకంటే.!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- KTR
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

