తైవాన్: తైపీ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ యువ షట్లర్ మన్నెపల్లి తరుణ్, ఉన్నతి హుడా ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో తరుణ్.. 21-12, 21-15తో జియోన్ హ్యూక్ జిన్ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. 21-11, 21-14తో మినొరు కొగ (జపాన్)ను చిత్తుచేయగా కిరణ్ జార్జ్ 21-10, 21-18తో వాంగ్ పొ-వి (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ ఉన్నతి 21-12, 21-18తో పీ యు వాంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించింది. ఆమెతో పాటు తన్వి శర్మ, దేవిక, అన్మోల్ ఖర్బ్ కూడా తదుపరి రౌండ్ చేరారు.