Saurabh Bharadwaj | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ బీజేపీపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఏం చేయాలో అన్నీ చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపుకు ముందు మీడియాతో మాట్లాడిన సౌరభ్ భరద్వాజ్.. కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
‘ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రభుత్వం నుంచి తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను, ఎన్నికల కమిషన్, పోలీసులు.. ఇలా అన్ని అధికారాలను ఆప్‌పై ప్రయోగించారు. కానీ ప్రజల ఆశీస్సులు ఆప్కే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రజలు నాలుగోసారి ముఖ్యమంత్రిని చేస్తారని, త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని ఆయన అన్నారు. తమ పార్టీకి కనీసం 40-45 సీట్లు వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఆప్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఓట్ల లెక్కింపులో ఆప్, బీజేపీ మధ్య హోరా హరీ పోటీ నెలకొంది. ఫలితాల తీరు క్షణక్షణం మారుతోంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 28 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
Also Read..
Delhi Election Results | లీడ్‌లోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా.. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోటీ