Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. ఇప్పటి వరకూ వెనుకంజలో కొనసాగుతున్న ఆప్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి వెనుకంజలో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) ప్రస్తుతం లీడింగ్‌లోకి వచ్చారు.
న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్గపై కేజ్రీ 254 ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు. ఇక జంగ్పూర అసెంబ్లీ నియోజకవర్గంలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) సైతం ప్రస్తుతం లీడింగ్‌లోకి వచ్చారు. ఆయన 1,800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిశీ వెనుకంజలోనే కొనసాగుతున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.
ఈ ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. ఆప్ సైతం క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం బీజేపీనే మేజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంలో ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 39 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే లీడింగ్‌లో ఉండటం గమనార్హం. ఆప్, బీజేపీ స్వల్ప తేడాతోనే ముందుంజలో ఉండటంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Also Read..
Delhi Election Results | భారీ ఆధిక్యం దిశగా బీజేపీ.. సీఎం ఆతిశీ వెనుకంజ
Delhi Election Results | 43 స్థానాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. కేజీవ్రాల్ సహా ఆప్ అగ్రనేతలు వెనుకంజ