న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Delhi Election Results) కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. బీజేపీ కంటే అధికార ఆప్ వెనుకబడిపోయింది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ 43 స్థానాల్లో ముందలో ఉండగా, ఆప్ 26 చోట్ల, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక ఆప్ కన్వీనర్ కేజ్రీవల్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకబడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అదేవిధంగా కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ వెనుకంజలో ఉన్నారు. జంగ్పూరలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పంత్ నగర్లో అవధ్ ఓజాపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆప్ అభ్యర్థులైన సత్యేంద్రకుమార్ జైన్ షాకుర్ బస్తీలో, అమానుతుల్లా ఖాన్ ఓక్లా స్థానంలో ముందంజలో ఉన్నారు. బద్లీ స్థానంలో కాంగ్రెస్ క్యాండిడేట్ దేవేంద్ర యాదవ్ వెనుకంజలో ఉండగా, గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ, బిజ్వాసన్లో కైలాష్ గెహ్లోత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.