Kubeer | నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్కు కుభీర్ విద్యార్థి ఎంపిక
నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు.
కుభీర్, మార్చి : నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు. మండల కేంద్రం కుభీర్ కు చెందిన షాబాజ్ ఖాన్ -నూర్జహా దంపతుల కుమారుడు సైఫుల్ల ఖాన్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ గతేడాది నవంబర్ లో నిర్వహించిననేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షక రాశాడు. 28వ తేదీ ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి నుండి చదువుల్లో ప్రథమ స్థానంలో నిలిచే సైఫుల్లా ఖాన్ NMMS కు ఎంపిక కావడంతో అతనికి ఉన్నత చదువులకోసం ప్రతి విద్యా సంవత్సరం రూ.12వేల చొప్పున కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ స్కాలర్షిప్ అందజేయనుంది.
విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, గైడ్ టీచర్ బారే శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ కందూరి సాయినాథ్ తదితరులు అభినందించారు. ముధోల్ నియోజకవర్గం లోని అన్ని పాఠశాలల నుండి విద్యార్థులు ఈ పరీక్షలు రాసినప్పటికి తాండూరు మండలం బోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఒకరు కుభీర్ నుండి సైఫుల్లా ఖాన్ ఎంపిక కావడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

