హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలే కాదని, చైర్మన్లుగా అగ్రకులాలకే అవకాశం కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
జనరల్ స్థానాల్లో బీసీలకూ చైర్మన్లుగా అవకాశం కల్పించాలని కోరారు. చైర్మన్లుగా, మేయర్లుగా 60 శాతం బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు.