Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్షాల ఉద్యమంతో మరో దారిలేక కేంద్ర విద్యా మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో, విద్యార్థి లోకం నిరసనను విరమించుకోగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు ధర్మేంద్ర రిజైన్ లెటర్‌కు ప్రెసిండెట్ ముర్ము అమోదం తెలిపారు. దాంతో, రాజ్యాంగబద్ధంగా ఆయన మంత్రి పదవి ఊడింది. ప్రస్తుతం ప్రధాన్ ఎంపీగా మాత్రమే కొనసాగనున్నారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో 37 రోజుల ఆందోళనకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగింపు పడింది. శనివారం సీజేపీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా ప్రధాన్ రాజీనామాకు ఒకరోజు సమయం అడిగారు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్. ప్రధాన్ రిజైన్ చేస్తారా? లేదా వేరే శాఖకు మారుస్తారా? అనే సందేహాల నడమ ఆయన రాజీనామా చేశారు.
President Droupadi Murmu, as advised by the Prime Minister, has accepted the resignation of Dharmendra Pradhan.
Further, as advised by the Prime Minister, the President has directed that Pralhad Joshi, Cabinet Minister, be assigned the charge of the Ministry of Education, in… pic.twitter.com/rMmTK99zdR
— ANI (@ANI) July 25, 2026
ప్రధాని నరేంద్ర మోడీకి తన రిజైన్ లెటర్‌ను పంపించి విద్యార్థుల నిరసనలకు తెరదించారు. ప్రధాన్ లేఖను ప్రధాని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా ఆమె ఆమోదించారు. తద్వారా ఆర్టికల్ 75(2) ప్రకారం కేంద్ర మంత్రి మండలి నుంచి ఆయనను తొలగించారు. అనంతరం తాత్కాలిక విద్యా మంత్రిగా ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi)ని నియమించారు. క్యాబినెట్ మంత్రి అయిన జోషికి ఆమె అదనపు బాధ్యతలు అప్పగించారు.