పెన్షన్ కోసం వెళ్లి వస్తూ వాగులో వృద్ధుడి గల్లంతు.. అచూకీ కోసం పోలీసుల గాలింపు
పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన వృద్ధుడు తిరిగి వస్తూ వాగులో గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేటలో శనివారం జరిగింది.
టేకుమట్ల, సెప్టెంబర్ 26 : పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన వృద్ధుడు తిరిగి వస్తూ వాగులో గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేటలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకాపేటకు చెందిన చిటికెల రవీందర్‌రెడ్డి(65) పింఛన్ డబ్బుల కోసం స్థానికులతో కలిసి శనివారం సమీపంలోని చలివాగు దాటి ఎంపేడు గ్రామానికి వెళ్లాడు.
పెన్షన్ డబ్బులు తీసుకున్న అనంతరం తిరిగి ద్వారకపేటకు వస్తుండగా చలివాగు దాటే క్రమంలో తన తోటి వారిని వదిలి నేను వెనక వస్తా .. మీరు పదండి .. అనడంతో వారు వాగు దాటారు. రవీందర్‌రెడ్డి వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహం పెరగడంతో నీటిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీమ్‌తో గాలింపు చేపట్టినా సాయంత్రం వరకూ రవీందర్‌రెడ్డి ఆచూకీ లభించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు బీహార్‌లో బందీ.. సీఎం జోక్యం
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

