వాజేడు, సెప్టెంబర్, 26: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం(Bogatha Waterfall) జలకళతో ఆకట్టుకుంటున్నది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతంలోకి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరదలొస్తున్నాయి.
జలపాతం వద్ద 50 అడుగులపై నుంచి వర్షపు నీరు జాలువారుతూ పాలనురగను తలపిస్తున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాల నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతాన్ని సందర్శించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేశారు.