Typhoid Vaccine | ప్రపంచంలోనే తొలిసారిగా టైఫాయిడ్‌ను నిర్మూలించేందుకు తొలిసారిగా భారత్ కాంబినేషన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ టీకా సాల్మోనెల్లా టైఫీ, సాల్మోనెల్లా పారాటిఫై-ఏ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించింది.
ప్రైవేటు కంపెనీలకు జారీ చేసిన అప్లికేషన్లో.. వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించడం, తర్వాతి పరీక్షలపై ఐసీఎంఆర్ సమాచారం అందించింది. టైఫాయిడ్ నివారణకు ప్రస్తుతం మార్కెట్లో పలు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. ఇందులో వీఐ పాలిసాకరైడ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ (TCV) ఉన్నాయి. ఆయా వ్యాక్సిన్స్ ప్రధానంగా సాల్మొనెల్లా టైఫీని లక్ష్యంగా చేసుకుంటాయి. సాల్మొనెల్లా పారాటిఫై-ఏ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ అందించలేవు. ఒకే సమయంలో రెండి నుంచి రక్షణ ఇచ్చే టీకాలు మాత్రం అందుబాటులో లేవు.
దేశంలో ప్రతి సంవత్సరం కోటిపైగానే టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టైఫాయిడ్ రోగుల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. భారత్‌లో సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ దేశంలో ఏటా కోటి మందికిపైగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ-ఏ కారణంగా వచ్చే ఎంటెరిఫిక్ ఫీవర్ భారత్‌లో ఆందోళన కలిగించే విషయం.
భారత్‌లో పది లక్ష జనాభాకు ప్రతి సంవత్సరం సగటున 399.2 టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది టీబీ సంక్రమణ కంటే చాలా ఎక్కువ. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని ఐసీఎంఆర్ పేర్కొంది. టైఫాయిన్ను తగ్గించేందుకు యాంటీబయాటిక్స్‌పై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని చెప్పింది. టైఫాయిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరడం, ఉత్పాదకత కోల్పోవడం తదితర ఆరోగ్య సంరక్షణ ఖర్చులను సైతం తగ్గిస్తుందని అభిప్రాయపడింది. మొదట వ్యాక్సిన్‌ను ఓఎంవీ ఆధారిత మొదట ఎలుకలపై ప్రయోగించారు. టీకాను ఎలుకలు ఇచ్చిన సమయంలో సరైన స్థాయిలో యాంటీబాడీస్ అభివృద్ధి చేశాయి. ఎలుకల ప్లీహంలోని సీడీ4, సీడీ8, సీడీ19 వంటి నిర్దిష్ట యాంటీబాడీస్ కణాలను పెంచినట్లుగా పరిశోధనల్లో గుర్తించారు.