ఢిల్లీ: వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్రాండ్ వాల్యూలోనూ తమకు సాటెవరూ లేరని నిరూపించింది.బ్రాండ్ విలువలో ప్రపంచ క్రికెట్లో తొలిసారిగా 300 మిలియన్ల యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2,895 కోట్లు) దాటిన తొలి ఫ్రాంచైజీగా ఘనత సాధించింది. నిరుడు 269 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ విలువ.. ఈ ఏడాదికి 16 శాతం పెరిగిందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ హౌలీహాన్ లోకీ బుధవారం ఒక నివేదికలో తెలిపింది. ఈ జాబితాలో ఆర్సీబీ (312 మిలియన్ డాలర్లు) తర్వాత ముంబై ఇండియన్స్ (264), కేకేఆర్ (245), సీఎస్కే (244), ఎస్ఆర్హెచ్ (168) టాప్-5లో ఉన్నాయి. ఫ్రాంచైజీ పేరు, ప్రతిష్ట, మార్కెట్ షేర్, వినియోగదారుల విశ్వసనీయత ఆధారంగా బ్రాండ్వాల్యూను లెక్కిస్తారు. ఇక ఓవరాల్గా ఐపీఎల్ బిజినెస్ విలువ 20.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.9 లక్షల కోట్లు) కు పెరిగింది. 2023తో పోలిస్తే (10.3) ఇది దాదాపు రెట్టింపు కావడం విశేషం.