రుద్రంపూర్, ఫిబ్రవరి 25 : ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి క్రీడా మైదానంలో నిర్వహించిన తెలంగాణ సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్–2026 పోటీల్లో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, రుద్రంపూర్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. వుషు మార్షల్ ఆర్ట్స్ (Wushu Martial Arts 42) 42 కేజీల విభాగంలో 8వ తరగతి విద్యార్థి సీహెచ్.అక్షిత్ కాంస్య పతకం సాధించాడు. విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థికి శిక్షణ అందించిన కోచ్లు, సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.