Delhli Elections : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మాజీ డిప్యూటీ సీఎం (Former Deputy CM) మనీశ్ సిసోడియా (Manish Sisodia) కు పరాజయం ఎదురైంది. జంగ్‌పురా (Jangpura) అసెంబ్లీ స్థానం నుంచి పోటీపడిన ఆయన ఊహించని రీతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లొచ్చాడన్న సానుభూతితో సిసోడియా గెలుపు ఖాయమని ఆప్ శ్రేణులు భావించాయి. కానీ అనూహ్యంగా ఆయన పరాజయం పాలయ్యారు.
బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో మనీశ్ సిసోడియా ఓడిపోయారు. మొత్తం 600 పైచిలుకు ఓట్ల తేడాతో సిసోడియా ఓటమిని మూటగట్టుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా వెనుకంజలో ఉన్నారు.
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్