Irrigation Officers | మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24 : కొత్తవారు ఎవరైనా ఫలానా దగ్గర ఆఫీస్ ఉందని అడ్రస్ వెతుక్కుంటూ మెదక్‌లోని నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయానికి వస్తుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఈ నెల 22వ తేదీన నీటి పారుదల శాఖ ఎక్కడ..? శీర్షికతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. ఈ కథనంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం కార్యాలయానికి వెళ్లే దారికి ఇరువైపులా పిచ్చిచెట్ల పొదలు తొలగించి శుభ్రపరిచారు.
ఈ క్రమంలో కార్యాలయానికి చెందిన రెండు పాతబోర్డులు బయట పడ్డాయి. అయితే బోర్డులపై పేర్లు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించడం పట్ల ప్రజలు, అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..