Local Body Reservations | రాయపోల్, నవంబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల కేటాయింపులో భాగంగా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎంపీడీవో జెమ్లా నాయక్ తెలిపారు. తాజా గెజిట్ ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
రిజర్వేషన్ ప్రకటనతో మండలంలో ఎన్నికల వాతావరణం కనిపించబోతుందన్నారు. ప్రజలకు పారదర్శకంగా రిజర్వేషన్ల వివరాలు అందించడం జరిగిందని తెలిపారు. రాయపోల్ మండలంలోని గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
రాయపోల్ మండలంలో రిజర్వేషన్లు..
గొల్లపల్లి- ఎస్సీ మహిళ,
రాయపోల్- ఎస్సీ జనరల్,
రామారం- ఎస్సీ జనరల్,
అనాజీపూర్- ఎస్సీ మహిళ,
వడ్డేపల్లి- బీసీ మహిళ,
లింగారెడ్డి పల్లి- బీసీ జనరల్,
అంకిరెడ్డిపల్లి- బీసీ జనరల్,
మంతూర్- బీసీ జనరల్,
బేగంపేట- బీసీ మహిళ,
సయ్యద్ నగర్- యుఆర్(అన్ రిజర్వ్డ్)
మహిళ, వీరారెడ్డిపల్లి- యుఆర్(అన్ రిజర్వుడ్)
మహిళ, టెంకంపేట- యుఆర్(అన్ రిజర్వుడ్)
జనరల్, రాo సాగర్ -యుఆర్(అన్ రిజర్వుడ్) జనరల్,
చిన్న మాసాన్ పల్లి -యుఆర్(అన్ రిజర్వుడ్) జనరల్,
ఆరెపల్లి- యుఆర్ (అన్ రిజర్వుడ్)మహిళ,
తిమ్మక్క పల్లి -యుఆర్(అన్ రిజర్వ్డ్) జనరల్,
కొత్తపల్లి- యుఆర్(అన్ రిజర్వుడ్)మహిళ,
ముంగిస్ పల్లి- యుఆర్(అన్ రిజర్వుడ్) మహిళ,
ఎల్కల్- యుఆర్(అన్ రిజర్వుడ్) జనరల్
రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు
Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..