Lakshmi Mittal | సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచేందుకు (Proposed Taxes On Super Rich) చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం సంపన్నులను ఆలోచనలో పడేసింది. పలువురు బిలియనీర్లు యూకేను వీడి.. పన్ను మినహాయింపు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు యూకేని వీడగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, స్టీల్ టైకూన్ (Steel Tycoon) లక్ష్మీ మిట్టల్ (Lakshmi Mittal) వచ్చి చేరారు.
భారత్‌కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal) సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్ను వీడనున్నట్లు తెలుస్తోంది (Lakshmi Mittal Quits UK). ప్రభుత్వ పన్ను విధానం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడాలని మిట్టల్ నిర్ణయించుకున్నట్లు బ్రిటన్ మీడియా నివేదించింది. ఆయన దుబాయ్‌కి మకాం మార్చే అవకాశం ఉందని తెలిసింది. ఇకపై పెట్టుబడులన్నీ దుబాయ్‌లోనే పెట్టే యోచనలో మిట్టల్ ఉన్నట్లు ది సండే టైమ్స్ నివేదించింది.
బ్రిటన్‌లో ఉన్నప్పటికీ వారి శాశ్వత నివాసం ఇతర దేశాల్లో ఉంటే.. విదేశీ ఆదాయంపై బ్రిటన్‌లో వారు పన్నులు కట్టనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు సంపన్నులు దేశం వీడుతున్నారు. కాగా, రాజస్థాన్‌లో జన్మించిన మిట్టల్.. బ్రిటన్‌లో 8వ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తుల విలువ 15.4 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఆర్సెలార్ మిట్టల్ సంస్థలో లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది.
Also Read..
Delhi Airport | టేకాఫ్ రన్‌వేపై ల్యాండ్ అయిన విమానం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
Two Buses Collide | రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి
Operation Crystal Fortress | ఢిల్లీలో కలకలం.. ఓ ఇంట్లో రూ.262 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం